
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఓ పక్క కాటమరాయుడు సినిమా చేస్తూనే దసరా రోజున మరో సినిమాకు ముహుర్తం పెట్టేశాడు. నేసన్ డైరక్షన్లో తమిళ సూపర్ హిట్ సినిమా వేదళం రీమేక్ గా ఏ.ఏం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో స్టార్ట్ అవనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను తీసుకున్నట్టు టాక్. నయన్ కూడా పవన్ తో సినిమా అనగానే పాజిటివ్ గా స్పందించినదట. కాకపోతే తెలుగు సినిమా అనగానే నయనతార ఓ చిన్న చూపు చూస్తుంది. డేట్స్ విషయంలో, పబ్లిసిటీ విషయంలో కాస్త ఇబ్బంది పెడుతుంది.
మరి ఈ విషయాలన్ని ఆలోచించే పవన్ నయనతారతో కమిట్ అవుతున్నాడా అని ఆరా తీస్తున్నారు. రీసెంట్ గా బాబు బంగారంలో వెంకటేష్ తో నటించిన నయనతార ఆ సినిమా దర్శకుడు మారుతిని ముప్పతిప్పలు పెట్టిందని తెలిసిందే. అయినా సరే పవన్ తో నయన్ కే ఛాన్స్ ఇస్తానంటే మంచిదే కాని అసలే పవన్ డేట్స్ విషయంలోనే ఓ క్లారిటీ ఉండదు ఇప్పుడు దానికితోడు నయనతార కూడా అలానే ఇబ్బంది పెడితే ఇక సినిమా అయినట్టే.
ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు కాకుండా నేసన్ తో సినిమా కమిట్ అయిన పవన్ ఇప్పుడు త్రివిక్రం సినిమా కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాడట. మరి ఒకేసారి మూడు నాలుగు లైన్లో పెట్టిన పవన్ ఆ సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తాడో మరి.