
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలి డైరక్షన్లో కాటమరాయుడు సినిమా చేస్తున్నాడు. కమిట్ అయిన సినిమానే ముక్కి మూలిగి అన్నట్టు కదులుతున్న సమయంలో ఇప్పుడు మరో సినిమా ముహుర్తం పెట్టి షాక్ ఇచ్చాడు. నేసన్ డైరక్షన్లో ఏ.ఎం రత్నం నిర్మాణంలో రీసెంట్ గా పవన్ సినిమా స్టార్ట్ చేశాడు. మరి చేస్తున్న కాటమరాయుడు సంగతే ఎటు తేల్చకుండా చేసిన పవన్ మళ్లీ మరో సినిమా ఎలా స్టార్ట్ చేశాడో అర్ధం కావట్లేదు.
ఇక ఓ పక్క త్రివిక్రం శ్రీనివాస్ సినిమా కూడా డిసెంబర్ లో స్టార్ట్ అంటూ ఊరించి ఇప్పుడు సడెన్ గా నేసన్ అనే కొత్త దర్శకుడితో సినిమా కమిట్ అయ్యాడు. ఫ్యాన్స్ కు అర్ధం కాకుండా ఉన్న ఈ మ్యాటర్ పై మీడియా కూడా తలా ఓ మాట రాస్తుంది. అందుకే ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఫ్యాన్స్. ఇక ఓ పక్క ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మాట ఏంటంటే కాటమరాయుడు సినిమాను పవన్ దాదాపు లైట్ తీసుకున్నాడట. అందుకే దానికి పార్లర్ గా మరో సినిమా చేస్తున్నాడని అంటున్నారు.
ఏది ఏమైనా ఒక్క సినిమాకే డేట్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న పవర్ స్టార్ ఇలా ఒకేసారి రెండు మూడు సినిమాలు అంటే అవి చేసేది ఎప్పుడు రిలీజ్ అయ్యేది ఎప్పుడు అని ఫ్యాన్స్ కన్ ఫ్యూజన్ తో తలలు పట్టుకుంటున్నారు.