
రచయితగా ఎన్నో సూపర్ హిట్లు అందుకున్న కోనా వెంకట్ ఈమధ్యనే నిర్మాతగా మారాడు. తన మార్క్ ఎంటర్టైన్మెంట్ కథలను దర్శక నిర్మాతల కోరిక మేరకు అందిస్తున్న కోనా పవన్ కళ్యాణ్ తో తనకున్న స్నేహంతో అతన్ని హీరోగా పెట్టే తను దర్శకుడిగా మారుతానని అన్నారు. పవర్ స్టార్ తో సినిమా అంటే కోనా డెబ్యూ సినిమా అంతకుమించిన రేంజ్ ఏముంటుంది చెప్పండి.
రీసెంట్ గా అభినేత్రితో మరోసారి నిర్మాతగా సక్సెస్ అయిన కోనా దర్శకుడిగా మారేందుకు తాను సిద్ధం అంటున్నాడు. పవన్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి కాగానే తన దర్శకత్వంలో సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే కోనా పవన్ కోసం దాదాపు రెండేళ్ల దాకా వెయిట్ చేసి తీరాల్సిందే. మరి అప్పటిదాకా ఆగుతాడా లేక మరేదైనా సినిమా కమిట్ అవుతాడా అన్నది చూడాలి. నిర్మతగా ఉంటూనే కోనా స్టార్స్ సినిమాలకు స్టోరీలను అందిస్తున్నాడు.