
లీకుల గోల ఎక్కువవడం వల్ల సినిమా సినిమాగా రిలీజ్ అవడం జరుగట్లేదు. రిలీజ్ కు ముందు సినిమాలోని ఏ సీన్ లీక్ కాకుండా జాగ్రత్త పడతారు కాని సంచలన దర్శకుడు వర్మ వీటన్నిటికి విరుద్ధం. ప్రస్తుతం తను తీస్తున్న వంగవీటి సినిమా వీడియో షాట్స్ రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. దసరా రోజు సినిమా షాట్స్ రిలీజ్ చేస్తా అని చెప్పగానే కొన్ని ఫోటో షాట్స్ ఏమో అనుకున్నారు. కాని వీడియో షాట్స్ నే రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశాడు వర్మ.
కాపు కాసే శక్తి అంటూ డైరెక్ట్ గా ఎటాక్ చేస్తున్నవర్మ సినిమా ఎన్ని గొడవలకు దారి తీస్తుందో అని ఆలోచిస్తున్నారు. ఇక ఇప్పుడు తాను రిలీజ్ చేసిన వీడియో షాట్స్ కూడా సినిమాలోని ఇంటెన్సిటీని తెలియచేస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే వర్మ ఈ వీడియో షాట్స్ ద్వారా సినిమా ఎంత భయంకరంగా ఉండబోతుందో చూపించాడు. 30 ఏళ్ల క్రిందట జరిగిన ఈ కథను మళ్లీ తెర మీదకు తెస్తున్న వర్మ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.