
నారా రోహిత్ హీరోగా పవన్ సాధినేని డైరక్షన్లో వస్తున్న సినిమా భీముడు. ఇప్పటికే రోహిత్ తో సావిత్రి సినిమా తీసిన ఈ దర్శకుడు ఈసారి భీముడిగా రోహిత్ ను చూపించేందుకు రెడీ అయ్యాడు. ఇదో హర్రర్ థ్రిల్లర్ కథ అని అంటున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం అప్పట్లో ఒకడుండేవాడు సినిమా చేస్తున్న నారా వారి అబ్బాయి త్వరలో ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న నారా రోహిత్ ఈ మధ్యనే జ్యో అచ్యుతానంద సినిమాతో హిట్ కొట్టాడి. అయితే అది తన మార్క్ సినిమా కాదు ఎప్పుడు కొత్త కథతో కొత్త ప్రెజెన్స్ తో కనిపించే రోహిత్ జ్యో సినిమాలో కూల్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. అందుకే మళ్లీ తన ట్రాక్లో సినిమా తీస్తున్నాడు. ప్రస్తుతం భీముడు షూటింగ్ స్టార్ట్ అయ్యింది సావిత్రి అంచనాలను అందుకోలేకపోయింది అందుకే ఈసారి దర్శకుడు పవన్ సాధినేని కచ్చితంగా హిట్ కొట్టేలా స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. మరి ఈ భీముడి కథ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.