
కన్నడ కుర్ర హీరో జాగ్వార్ తో తొలి పరిచయం అయిన కుమారస్వామి తనయుడు నిఖిల్ ఇప్పుడు తన సెకండ్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. జాగ్వార్ గా వచ్చిన నిఖిల్ టాక్ ఎలా ఉన్నా కుర్రాడిలోని స్పీడ్ అందరికి నచ్చింది. అందుకే ఇప్పుడు వెంటనే సెకండ్ సినిమా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు కూడా తెలుగు దర్శకుడు సురేందర్ రెడ్డిని తీసుకున్నారట కుమారస్వామి.
ప్రస్తుతం చేస్తున్న చరణ్ ధ్రువ సినిమా కంప్లీట్ కాగానే నిఖిల్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సురేందర్ రెడ్డితో చర్చలు ముగిశాయని తెలుస్తుంది. కన్నడ మాజి ముఖ్యమంత్రి అయిన కుమార స్వామి తనయుడిని అక్కడ పెద్ద స్టార్ హీరో చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మొదటి సినిమాను అత్యంత భారీగా 70 కోట్లతో నిర్మించాడు. ఇక సెకండ్ సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని టాక్.
ఆ సినిమా కూడా కన్నడతో పాటుగా తెలుగులో కూడా వస్తుందట. అసలైతే పూరి డైరక్షన్లో నిఖిల్ ఇంట్రడ్యూస్ అవ్వాల్సి ఉంది కాని పూరి తమకు నచ్చిన కథ చెప్పలేదు అందుకే మహదేవ్ తో కమిట్ అయ్యాం అని జాగ్వార్ నిర్మాత కుమారస్వామి అన్నారు. మరి సురేందర్ రెడ్డి సినిమా అయినా తనయుడికి హిట్ ఇచ్చేలా చేస్తాడేమో చూడాలి.