టీజర్ తో అదరగొట్టిన ధ్రువ..!

ఈ దసరా కానుకగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్లో వస్తున్న ధ్రువ టీజర్ రిలీజ్ అయ్యింది. తమిళ తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టరే అంచనాలను ఏర్పడేలా చేస్తే ఇక స్టైలిష్ లుక్ తో చెర్రి టీజర్ కూడా అదరగొట్టింది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారక్టర్ తెలుస్తుంది.. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది అని సినిమా థీంను తెలియచేస్తున్న ధ్రువ. 

ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే మై ఎనిమీ ఈజ్ మై స్ట్రెంత్ అని పోస్టర్ తో ప్రేక్షకులను అలరించిన చెర్రి ఈ టీజర్ తో ఫ్యాన్స్ కు దసరా గిఫ్ట్ ఇచ్చాడు. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ ఎలా ఉంటుందో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే తెలుస్తుంది. డిసెంబర్ లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇదే ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే అతి పెద్ద సినిమా అని చెప్పాలి. బ్రూస్ లీ ఫ్లాప్ తో ఢీలా పడ్డ చరణ్ ధ్రువతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ధ్రువ చరణ్ కోరిక తీరుస్తుందా అన్నది తెలుసుకోవాలంటే డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సిందే.