ఆస్కార్ అవార్డ్ విజేత విల్ స్మిత్‌పై వేటు

ఇటీవల ఆస్కార్ అవార్డ్ అందుకొన్న హాలీవుడ్ నటుడు విల్ స్మిత్‌ 10 ఏళ్ళపాటు ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనకుండా మోషన్ పిక్చర్స్ అకాడమీ నిషేదం విధించింది. వీటితో పాటు అకాడమీ నిర్వహించే అన్ని వేడుకలకు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. 

ఇటీవల జరిగిన 94వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో యాంకర్‌గా వ్యవహరించిన ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్, తన భార్య జాడా పింకెట్‌ని ఉద్దేశ్యించి సరదాగా జోకులు వేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విల్ స్మిత్‌ వేదికపైకి వెళ్ళి అందరూ చూస్తుండగా క్రిస్ రాక్‌ చెంప చెళ్ళుమనిపించేడు. ఆయనకు ఇచ్చిన ఆస్కార్ అవార్డును కమిటీ వెనక్కు తీసుకొంటుందని అందరూ భావిస్తుండగా వేడుకలకు నిషేధంతో సరిపెట్టింది.      

అకాడమీలో సభ్యుడిగా ఉన్న విల్ స్మిత్‌ ఇటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని గ్రహించి ముందే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అకాడమీ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. 

ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో యాంకర్ చెంప చెళ్ళు: