కలర్ఫుల్ శతమానం భవతి..!

దిల్ రాజు చాలా రోజుల తర్వాత ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన ప్రొడక్షన్లో ఎన్నో యూత్ ఫుల్ సినిమాలొచ్చాయి. కాని పది సంవత్సరాల క్రితం వచ్చిన బొమ్మరిల్లు ఇప్పటికి ఆ బ్యానర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచి ఉంది. అయితే ఆ క్రమంలో ఆ సినిమా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో శతమానం భవతి అంటూ ఓ సినిమా తీస్తున్నాడు రాజు గారు. సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా మరో బొమ్మరిల్లు అనేస్తున్నారు.

ఇక రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. శర్వానంద్ అనుపమా పరమేశ్వరన్ లీడ్ రోల్స్ గా నటిస్తున్న ఈ సినిమ టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కనిపిస్తున్న ఈ సినిమా అంతకుమించి మంచి ఎమోషనల్ మూవీగా ఉంటుందని తెలుస్తుంది. టీజర్ అయితే కలర్ ఫుల్ గా ఉంది. ఇక సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. అసలే ఈ పొంగల్ వార్లో బాలయ్య, చిరులు పోటీ పడుతుంటే వారికి పోటీగా తాను వస్తానంటున్నాడు దిల్ రాజు. 

మరి సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్న రాజు గారు సినిమా ఫలితాన్ని ఏ రేంజ్లో అందుకుంటాడో చూడాలి. ఈ ఇయర్ ఎక్స్ ప్రెస్ రాజా హిట్ తో మంచి ఫాంలో ఉన్న శర్వానంద్, వరుస హిట్లతో ఫుల్ క్రేజ్ లో ఉన్న అనుపమ సినిమాకు ప్లస్ అవనున్నారు.