
సాధారణంగా స్టార్ హీరోలకే ఫ్యాన్స్ లు ఉంటారు.. అఫ్కోర్స్ హీరోయిన్స్ కు ఫ్యాన్స్ ఉన్నా సరే అంతగా బయట పడరు. కేవలం షాప్ ఓపెనింగ్స్.. ఏదైనా సెలబ్రిటీ మీటింగ్ అనుకుంటే తప్ప హీరోయిన్స్ కు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్నది బయటపడదు. కాని ప్రస్తుతం టాలీవుడ్లో లీడింగ్ లో ఉన్న హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన బర్త్ డే ఫ్యాన్స్ మధ్యలో జరుపుకుని తన క్రేజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకుంది. స్టార్స్ బర్త్ డే అయితే అతని సమక్షంలో కాని అతను లేకపోయినా వారి పేరు మీద కేక్ కట్ చేయడం చూస్తూనే ఉంటాం కాని రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఫ్యాన్స్ కేక్ కట్ చేశారు అది ఆమె సమక్షంలోనే.
తన మీద అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కానుకగా ఆమె తన ఫ్యాన్స్ ను కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారి మధ్యనే తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకుంది రకుల్ ప్రీత్ సింగ్. నిన్న జరిగిన ఈ వేడుక స్టార్ హీరోలకే షాక్ ఇచ్చేలా జరిగింది. స్టార్ హీరోల బర్త్ డేలకే సాధారణంగా ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి కాని రకుల్ కి కూడా ఈరేంజ్ ఫాలోయింగ్ అంటే ఇక రాబోయే కాలంలో అమ్మడికి ఇంకా క్రేజ్ పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.
ఓ స్పెషల్ కాంటెస్ట్ నిర్వహించి అందులో గెలిచిన తన ఫ్యాన్స్ మధ్యలో నిన్న తన బర్త్ డే వేడుకలు జరుపుకున్న రకుల్ నిజంగా టాలీవుడ్ మిగతా హీరోయిన్స్ కళ్లు కుట్టుకునేలా చేస్తుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ సినిమాలో నటిస్తున్న రకుల్.. మరో పక్క చెర్రి ధ్రువలో కూడా లీడ్ రోల్ గా చేస్తుంది. ఇవే కాకుండా కుర్ర హీరోలు సాయి ధరం తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ లతో కూడా జతకడుతుంది ఈ లక్కీ గాళ్.