
ప్రేమమ్ తో అక్కినేని అభిమానులకు దసరా పండుగను ఓ వారం ముందే తెచ్చిన దర్శకుడు చందు మొండేటి కచ్చితంగా సినిమా సక్సెస్ లో ముఖ్య భూమిక పోశించాడని చెప్పొచ్చు. నాగ చైతన్యను చాలా కొత్తగా చూపించి సినిమా హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఓ రీమేక్ సినిమాకు కూడా ఈ రేంజ్లో తీయొచ్చు అని నిరూపించాడు. కార్తికేయతోనే తనలోని ప్రతిభ చాటుకున్న చందు మొండేటి సెకండ్ సినిమా రీమేక్ అనేసరికి అందరికి ఆశ్చర్యం కలిగింది. రీమేక్ అయినా తన మార్క్ క్రియేటివిటీతో సూపర్ హిట్ అందుకున్నాడు.
అందుకే ఇతనితో సినిమా చేసేందుకు కుర్ర హీరోలంతా క్యూ కడుతున్నారు. వరుణ్ తేజ్ హీరోగా చందు మొండేటి సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఐడ్రీం మీడియా ఈ సినిమాను నిర్మిస్తుందని టాక్. ఇప్పటికే వరుణ్ తేజ్ కు చందు కథ చెప్పడం వరుణ్ ఓకే చేయడం అంతా జరిగింది. సో ఏమూలనో డౌట్ ఉన్నా అది కూడా ఈ హిట్ తో తీరినట్టే సో మెగా హీరో ఛాన్స్ పట్టేసిన చందు ఇక అది కూడా హిట్ కొట్టాడంటే ఖచ్చితంగా మిగతా దర్శకులకు షివరింగ్ మొదలైనట్టే.