మెగా నందమూరి మూవీ టైటిల్ ఇదే..!

మెగా నందమూరి మల్టీస్టారర్ గా రాబోతున్న సినిమాకు టైటిల్ కన్ఫాం అయ్యింది. మెగా హీరో సాయి ధరం తేజ్, నందమూరి హీరో కళ్యాణ్ రాం కలిసి చేస్తున్న సినిమా ఏ.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాబోతుంది. కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ముహుర్తం పెట్టబోతున్నారు. అయితే ఈ సినిమాకు టైటిల్ గా రామకృష్ణ అని పెట్టబోతున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా త్రిష, రెజినాలను సెలెక్ట్ చేయబోతున్నారట.

మరి రామకృష్ణ అనే టైటిల్ చాలా క్లాసీగా ఉంది టైటిల్ ను బట్టి చూస్తుంటే సినిమా కూడా అదే తరహాలో క్లాసీగా ఉంటుందని తెలుస్తుంది. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో సాయి ధరం తేజ్ తో హిట్ అందుకున్న రవికుమార్ చౌదరి లాస్ట్ ఇయర్ సౌఖ్యం ఫ్లాప్ తో కాస్త వెనుకపడ్డాడు అందుకే ఈ మల్టీస్టారర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇక కళ్యాణ్ రాం తను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం త్వరలో రానుండగా తేజు మాత్రం గోపిచంద్ మలినేని డైరక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.