త్రివిక్రం కొత్త టర్న్..!

మాటల మాత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ మొదట రచయితగా ఆ తర్వాత దర్శకుడిగా రికార్డులు బద్ధలు కొట్టాడు ఇప్పుడు త్రివిక్రం ఓ కొత్త టర్న్ తీసుకుంటున్నాడు అదే నిర్మాతగా మారడం. ఓ దర్శకుడు నిర్మాతగా మారడం అంటే తన దర్శకత్వంలోనే సినిమా చేస్తారు కాని ఇక్కడ త్రివిక్రం మాత్రం నందిని రెడ్డికి అవకాశం ఇస్తున్నాడు. కళ్యాణ వైభోగమే తర్వాత నందిని రెడ్డి కథ పట్టుకుని రాధాకృష్ణ (చినబాబు)కి వినిపించిందట. ఆ సమయంలో త్రివిక్రం కూడా ఉండటంతో నందిని రెడ్డి చెప్పిన కథ తనని ఇంప్రెస్ చేసిందట.

అందుకే ఈసారి నిర్మాతగా చేసేందుకు ప్రత్నాలు మొదలు పెట్టాడు. ఇక ఇందులో హీరోగా పెళ్లిచూపులుతో సూపర్ క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ నటిస్తున్నాడట. ప్రస్తుతం ఈ కుర్ర హీరో కమిట్ అయిన సినిమాలన్ని పూర్తి చేసుకుని నందిని రెడ్డికి డేట్స్ ఇస్తాడట. సో మాటల మాంత్రికుడు త్రివిక్రం నిర్మాణం అంటే అతని సినిమా అన్నట్టే. మరి తన సినిమాలతో ఆడియెన్స్ ను అలరించే త్రివిక్రం నిర్మాతగా ఎలాంటి సినిమా అందిస్తాడో చూడాలి.