కార్తి కాష్మోరా ట్రైలర్ అదుర్స్..!

సూర్య తమ్ముడు కార్తి అటు కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ సంపాదించాడు. పక్కింటి అబ్బాయే అన్న తరహాలో కార్తి నటన అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఇయర్ ఇప్పటికే ఊపిరి హిట్ తో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన కార్తి తను లీడ్ రోల్ చేసి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కాష్మోరాతో ముందుకు రాబోతున్నాడు. దీపావళికి కానుకగా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ రీసెంట్ గా జరిగింది. మాధవన్ ప్రత్యేక అతిధిగా వచ్చి రిలీజ్ చేసిన ఈ తెలుగు ఆడియోలో కార్తి తెలుగు ప్రేక్షకులు తనని ఆదరిస్తున్న తీరు కొనియాడారు.

ఇక ట్రైలర్ మాత్రం మగధీర, బాహుబలి సినిమాలకు ఏమాత్రం తీసి పోకుండా ఉంది. మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్న కార్తి పిరియాడికల్ ఎపిసోడ్స్ కూడా సినిమాలో ఉన్నాయని అవి హైలెట్ అవనున్నాయని చెప్పాడు. రిలీజ్ చేసిన ట్రైలర్ లో కూడా భారీ సెట్టింగ్స్ తో బాహుబలి రేంజ్లో కనిపిస్తుంది. మరి ట్రైలర్ అయితే అంచనాలను పెంచేసింది సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.

గోకుల్ డైరెక్ట్ చేస్తిన ఈ సినిమా పివిపి బ్యానర్ లో పరం వి పొట్లూరి నిర్మిస్తున్నారు. నయనతార, శ్రీదివ్య హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చిత్రయూనిట్ చెప్పుకొచ్చారు.