
కొద్దికాలంగా హిట్ కోసం తహతహలాడుతున్న అక్కినేని వారసుడు నాగ చైతన్య ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు. మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమం తెలుగు రీమేక్ చేసిన చైతు ఆ సినిమా ఒరిజినల్ వర్షన్ కన్నా బెటర్ ట్రీట్ మెంట్ తో హిట్ అందుకున్నాడు. కార్తికేయ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన చందు మొండేటి తెలుగు ప్రేమం డైరెక్ట్ చేశాడు. తనదైన క్రియేటివ్ స్టైల్ తో చందు తన ప్రతిభ చాటుకున్నాడు.
చైతు కెరియర్ లో ఈ ప్రేమం ఓ మైల్ స్టొన్ మూవీ అని చెప్పొచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయంలో కూడా చాలా సెటిల్డ్ గా నాగ చైతన్య తనలోని మెచ్యుర్డ్ పర్ఫార్మెన్స్ సినిమాలో కనబరిచాడు. ఇక అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్, మడోన్నా సెబాస్టియన్ ముగ్గురు హీరోయిన్స్ సినిమాకు ప్రాణం పోశారు. యునానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ప్రేమం మొదటి రోజే భారీ రేంజ్ కలక్షన్స్ సాధించిందని చెప్పొచ్చు.
లవర్ బోయ్ ఇమేజ్ తో సినిమాలు హిట్ కొడుతున్నా మధ్యలో మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేసిన చైతు తనకు సూట్ అయ్యే లవర్ బోయ్ పాత్రలతో సినిమా చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రేమం చూస్తే అర్ధమవుతుంది. మూడు దశల్లోని ప్రేమ ఆ పాత్రల్లో చైతు అభినయం సినిమాకు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టాయి. సో అక్కినేని హిట్ మేనియా ప్రేమం కంటిన్యూ చేస్తుంది అని చెప్పేయొచ్చు.