మహేష్ బాబుకి కరోనా పాజిటివ్

ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని స్వయంగా ట్విట్టర్‌లో తెలియజేశారు. కనుక హోమ్ క్వారెంటైన్‌లో ఉంటున్నానని, ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని మహేష్ బాబు విజ్ఞప్తి చేశారు.