సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!

ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ సినిమాతో నాగ చైతన్యను కూడా లైన్లో పెట్టేసింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడం పెద్దలు ఒప్పుకోవడం పెళ్లికి సిద్ధమవడం ఇదంతా తెలిసిన మ్యాటరే కదా.. అయితే పెళ్లి తర్వాత సమంత సినిమాలు చేస్తుందా చేయదా అన్న ప్రశ్న తరచు ఎదురవుతుంది. చైతు ఏమో తను పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది అని చెప్పుకొచ్చాడు అప్పట్లో సమంత రెండు తమిళ సినిమాలకు కావాలని వదిలేసింది. ఇంతకీ సమంత సినిమాలు చేస్తుందా లేదా అన్నది అడిగితే ఆమె మాత్రం తనకు మంచి పాత్రలు రావట్లేదు అని షాక్ ఇచ్చింది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం సమంత ఇప్పటికే కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమకు సైన్ చేయగా ఇప్పుడు విశాల్ తో కూడా మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సో సమంత ఇక సినిమాల్లో కనిపించదు అనుకుని హర్ట్ అయిన ఆమె ఫ్యాన్స్ కు ఇదో గుడ్ న్యూస్. అయితే సమంత ఇన్నాళ్ల లానే గ్లామర్ రోల్స్ చేస్తుందా లేక కేవలం అభినయం ఉన్న సినిమాలనే చేస్తుందా అన్నది చూడాలి. ఇప్పటికైతే సమంత సినిమా న్యూస్ విని ఫ్యాన్స్ హంగామా మొదలు పెట్టారు.