కాస్కోండి అంటున్న నయన్..!

ఈ దీపావళికి రిలీజ్ అవబోతున్న కోలీవుడ్ సినిమా కాష్మోరా మీద అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గోకుల్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాలో కార్తి లుక్ ఇప్పటికే ఓ రేంజ్లో క్రేజ్ తీసుకువస్తే ఇప్పుడు అదే సినిమాలోని నయనతార లుక్ రివీల్ చేసి సినిమా మీద క్రేజ్ డబుల్ అయ్యేలా చేశారు చిత్రయూనిట్. మహారత్నదేవిగా నయనతార లుక్ అదరగొట్టేసింది. కత్తి పట్టి యుద్ధానికి రెడీ అన్న తీరున నయనతార లుక్ ఎంతో ఇంటెన్స్ ను తెలియచేతుంది. అయితే ఈ లుక్ తో బాహుబలి శివగామితో అదరగొట్టిన రమ్యకృష్ణ, రుద్రమదేవిగా హల్ చల్ చేసిన అనుష్కలకు నయన్ కాస్కోండి అంటున్నట్టు ఉంది.

సౌత్ లో అటు గ్లామర్ పాత్రలతోనే కాకుండా కాస్త డిఫరెంట్ గెటప్స్ తో ప్రయత్నించాలి అంటే కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యం. అలాంటి వారిలో ఇప్పటిదాకా క్రేజ్ సంపాదించిన అనుష్క ఇప్పుడు కొత్తగా నయన్ చూసి కంగారు పడుతుంది. కాష్మోరాతో నయన్ కూడా తనలోని కొత్త యాంగిల్ బయట పెట్టేస్తుంది అని చెప్పొచ్చు. మరి సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో ఏమో గాని కాష్మోరాలో అటు కార్తి లుక్.. ఇటు నయనతార లుక్స్ మాత్రం అదరగొట్టేస్తుననాయి.

ఈ అంచనాలకు తగ్గట్టు సినిమా కూడా ఉంటే ఖచ్చితంగా కార్తి కెరియర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇయర్ ఊపిరితో తెలుగులో కూడా హిట్ అందుకున్న కార్తి కాష్మోరగా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది.