
తెలుగు దర్శకుల్లో పూరి స్టైలే వేరు.. తన సినిమాల్లో హీరోలతో పదునైన డైలాగులను ప్రెజెంట్ చేసే పూరి అదే సినిమాలో హీరోయిన్స్ తో గ్లామర్ రసాన్ని పండించేస్తాడు. ప్రస్తుతం కళ్యాణ్ రాంతో ఇజం సినిమా చేస్తున్న పూరి ఈ సినిమాకు తన స్టైల్ ను మార్చాడని అనిపిస్తుంది. సినిమా ట్రైలర్, టీజర్ సాంగ్స్ లో ఎక్కడ హీరోయిన్ అదితి ఆర్యను హాట్ గా చూపించలేదు. ఓ విధంగా పూరి సినిమాల్లో బీచ్ పాటలు హైలెట్ అలాంటిది ఈ సినిమాలో అలాంటి సాంగ్ కూడా లేదట.
మరి పూరి ఎందుకు ఇలా తన రూటు మార్చుకున్నాడు అంటే కంటెంట్ మీద ఆడియెన్స్ గ్రిప్ పెంచుకునే క్రమంలో ఆ ట్రాక్ కాస్త మిస్ గైడ్ చేస్తుందని తానే తెలుసుకుని బీచ్ సాంగ్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేశాడట. మరి మార్చిన పూరి స్టైల్ ఏవిధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఇజం కోసం హీరో కం ప్రొడ్యూసర్ కళ్యాణ్ రాం కూడా చాలా కష్టపడ్డట్టు అనిపిస్తుంది. ఇజం హిట్ తో తనకో ట్రేడ్ మార్క్ తీసుకు రావాలని ఉత్సాహ పడుతున్న కళ్యాణ్ రాం సినిమా ఫలితం ఏ విధంగా అందుకుంటాడో చూడాలి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఇజం ఈ నెల 20న రిలీజ్ అవుతుంది.