ఆ ఛాన్స్ సుమంత్ దక్కించుకున్నాడు..!

ఎం.ఎస్ రాజు తనయుడిగా సుమంత్ తనదైన స్టైల్ లో సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఎన్నాళ్లనుండో తన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా లేడీస్ టైలర్ కు సీక్వల్ గా సినిమా చేద్దాం అనుకుంటున్న సీనియర్ దర్శకుడు వంశీకి హీరోలు దొరక్కుండా పోయారు. అప్పట్లో రాజ్ తరుణ్ వంశీ ఫ్యాషన్ డిజైనర్ చేస్తున్నాడని వార్తలు వచ్చినా అవి నిజం కాదని తేలింది. అయితే ఇప్పుడు వంశీ కన్నుల్లో సుమంత్ పడ్డాడు అంతే తనని ఫ్యాషన్ డిజైనర్ గా చేసే భాధ్యత తీసుకున్నాడు.

ఒకప్పుడు బడా నిర్మాతగా ఎం.ఎస్ రాజు పెద్ద సినిమాలనే చేశాడు. ఇక ఆ తర్వాత ఆర్ధికంగా దెబ్బ తినడంతో కాస్త వెనక్కి తగ్గారు. దర్శకుడిగా కూడా ఒకటి రెండు సినిమాలు తీసిన ఎం.ఎస్ రాజు తన కొడుకు కెరియర్ మీద పూర్తి దృష్టి పెట్టారు. అందుకే సుమంత్ చేసే ప్రతి సినిమా విషయంలో ఎం.ఎస్ రాజు హస్తం ఉంటుంది. ఇప్పుడు చేయబోయే వంశీ సినిమాకు కూడా రాజు గారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో సుమంత్ ఓకే అనేశాడు. హీరోగా ఎవరు ఓకే అంటారా సినిమా తీసేద్దాం అని స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసుకుని ఉన్న వంశీకి సుమంత్ ఓకే అనడం లక్ తగిలినట్టే అయ్యింది. రీసెంట్ గా రైట్ రైట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్ ఆ సినిమాతో ఆడియెన్స్ కు దగ్గర కాలేకపోయాడు. 

మరి వంశీ చేస్తున్న ఫ్యాషన్ డిజైనర్ తో అయినా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటాడేమో చూడాలి. ప్రస్తుతం మిగతా కాస్ట్ గురించి చర్చలు జరుగుతుండగా సినిమాను కూడా త్వరలో స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు.