పుష్పలో దాక్కో దాక్కో మేక...వీడియో సాంగ్‌ను విడుదల

అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప సినిమాలో మొదటి ఫుల్ వీడియో సాంగ్‌ ‘దాక్కో దాక్కో మేక...’ను ఈరోజు విడుదల చేశారు. తెలుగుతో పాటు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వెర్షన్‌లలో కూడా ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌ హావభావాలు ఒక ఎత్తైతే, ఆకలి, ఎర, చావు, జీవన్మరణ సమస్యను తేలికపాటి పదాలతో చంద్రబోస్ ఇచ్చిన అద్భుతమైన లిరిక్స్ మరో ఎత్తు అని చెప్పక తప్పదు. ఈ సాంగ్‌ చిత్రీకరణ కూడా చాలా అద్భుతంగా ఉంది. 

ఈనెల 17న పుష్ప రిలీజ్ అయినప్పటి నుంచి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈరోజు విడుదలైన వీడియో సాంగ్‌కు కూడా యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.