నటి సమంత తన స్నేహితురాళ్ళతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడ బీచ్లో వారు స్విమ్ సూట్లో తీసుకొన్న ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆమె నాగ చైతన్యతో వివాహబందంలో ఉన్నట్లయితే అక్కినేని కుటుంబ ప్రతిష్టకు భంగం కలగకుండా వ్యవహరించవలసి ఉంటుంది. కానీ ఆమె ఎటువంటి ఆంక్షలు లేని స్వేచ్చాజీవితం కోరుకొంటోందని కానీ అది లభించనందుకే ఆమె భర్త నుంచి విడిపోయినట్లు క్రమంగా స్పష్టం అవుతోంది.
పుష్పలో ఐటెమ్ సాంగ్, తరువాత ‘ఆరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ ఇంగ్లీష్ చిత్రంలో లెస్బియన్ పాత్రలో చేయడానికి అంగీకరించడం, తాజాగా స్విమ్ సూట్లో ఈ ఫోటో మొదలైనవన్నీ ఆమె కోరుకొంటున్న స్వేచ్చా జీవితానికి అద్దం పడుతున్నాయని చెప్పవచ్చు.
వేరెవరైనా హీరోయిన్ స్విమ్ సూట్ వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చినా అందరూ యధాలాపంగా చూసి మరిచిపోయేవారే. కానీ నేటికీ సమంతపై అక్కినేని ఇంటి కోడలు ముద్ర పూర్తిగా తొలగిపోలేదు కనుకనే ఆమె ఈవిదంగా ఏమి చేసినా భూతద్దంలో నుంచి చూసినట్లు పెద్దగా కనిపిస్తోందని చెప్పవచ్చు.