డిసెంబర్ 31న ఒకే రోజున ఏడు సినిమాలు, జనవరి 1న రెండు కొత్త సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి
డిసెంబర్ 31న: 1945 (తెలుగు), అర్జున ఫల్గుణ, అంతఃపురం, విక్రమ్, డిటెక్టివ్ సత్యభామ, జెర్సీ (హిందీ రీమేక్), టెన్ కమాండెంట్స్ (తెలుగు అనువాద చిత్రం ), జనవరి 1న ఇందువదన, ఆశ ఎన్కౌంటర్ చిత్రాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి.
పీరియాడికల్ మూవీగా వస్తున్న 1945లో రానా, రెజీనా, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలలో నటించారు. దీనికి సత్యశివ దర్శకత్వం చేశారు.
అర్జున ఫల్గుణలో శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ హీరోహెరోయిన్లుగా నటించారు.
సి.సుందర్ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన అరణ్మణై, అరణ్మణై-2, అరణ్మణై-3 వచ్చాయి. వాటిలో అరణ్మణై-3కి తెలుగు అనువాద చిత్రమే ఈ అంతఃపురం. దీనిలో హీరోగా ఆర్య, హీరోయిన్లుగా రాశి ఖన్నా, ఆండ్రియా నటించారు.
హరిచందన్ దర్శకత్వంలో నాగవర్మ బైర్రాజు, దివ్యా సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం విక్రమ్.
మళ్ళీ చాలా రోజుల తరువాత సోనీ అగర్వాల్ డిటెక్టివ్ సత్యభామగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
నాని హీరోగా సూపర్ హిట్ మూవీ జెర్సీని హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. హిందీ వెర్షన్లో నాని పాత్రను షాహిద్ కపూర్ చేశాడు. అతనికి జంటగా మృణాల్ ఠాకూర్ చేసింది. దీనికి కూడా గౌతమ్ తిన్నాసూరి దర్శకత్వం చేశాడు.
అలనాటి క్లాసిక్ మూవీ ‘టెన్ కమాండెంట్స్’ గురించి తెలియనివారుండరు. దానినే అదే పేరుతో మళ్ళీ రీమేక్ చేసి ఇంగ్లీష్, పలు భారతీయ భాషలలో విడుదల చేస్తున్నారు. రాబర్ట్ డోర్న్ హెల్మ్, జెఫ్రీ మడేజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో డౌగ్రే స్కాట్ మోసెస్గా నటించారు.
జనవరి 1 రిలీజ్:
ఇందువదన: వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, దర్శకత్వం: ఎం.శ్రీనివాసరాజు
ఆశ ఎన్కౌంటర్: 2019లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఆశ గ్యాంగ్ రేప్, నిందితుల ఎన్కౌంటర్ను కధాంశంగా తీసుకొని ఆనంద్ చంద్ర దర్శకత్వంలో రాంగోపాల్ వర్మ సమర్పణలో వస్తున్న చిత్రం ఇది.