
సమంత సినిమాలు...వాటిలో ఆమె అద్భుతమైన నటన గురించి అందరికీ తెలుసు. సూపర్ డూపర్ హిట్ అయిన ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్‌తో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఆ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించిన రాజ్-డీకేలు సమంత ప్రతిభ చూసిన తరువాత తమ దర్శకత్వంలోనే తీయబోతున్న ‘సిటాడేల్’ అనే వెబ్ సిరీస్‌లో ఆమెను మళ్ళీ ప్రధానపాత్రకు తీసుకొన్నారు.
భారీ యాక్షన్ ప్యాక్డ్ స్పై థ్రిల్లర్‌గా రూపొందబోయే సిటాడేల్ వెబ్ సిరీస్‌లో సమంత, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ గూడఛారులుగా నటించబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా దీనిలో ఓ ముఖ్యమైన పాత్ర చేయబోతోంది. ఈ వెబ్ సిరీస్‌కు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ పనిచేయబోతున్నారు. కనుక ఆ యాక్షన్ సీన్స్ చేయడం కోసం సమంత, వరుణ్ ధావన్ ఇద్దరూ విదేశాలలో శిక్షణ తీసుకోబోతున్నారు.
ఫ్యామిలీ మ్యాన్ వలన ఫ్యామిలీ లైఫ్ పోగొట్టుకొన్న సమంత ఒకవైపు తెలుగు, తమిళ్ సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్‌తో జాతీయ స్థాయికి ఎదిగి, తరువాత ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ సినిమాతో హాలీవుడ్ స్థాయికి ఎదగబోతుండటం చాలా గొప్ప విషయమే కదా!