సెక్సీగా కనిపించడానికి ఇంకా కష్టపడాలి: సమంత

సమంతతో విడిపోయిన తరువాత నాగ చైతన్య ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో “నేను ఎటువంటి పాత్రలు చేయడానికైనా సిద్దం కానీ వాటి వలన నా కుటుంబ ప్రతిష్ట దెబ్బ తింటుందంటే నేను చేయను,” అని అన్నారు. కానీ సమంత వివాహబందం నుంచి బయటపడిన తరువాత ఆమె ఒప్పుకొంటున్న సినిమాలు, చేస్తున్న పాత్రలు, సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న మెసేజులతో ఇప్పుడు పూర్తి స్వేచ్చను అనుభవిస్తున్నట్లు అర్దం అవుతోంది. తాజాగా ఆమె పెట్టిన ఈ సందేశం చూస్తే ఇది నిజమని అర్దమవుతుంది. 

పుష్పలో తను చేసిన ‘ఊ అంటావా మావా...ఊఊ అంటావా మావా...’ ఐటెమ్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూస్తున్న సమంత, “నేను చాలా మంచిగా చేశాను. చెడుగా కూడా చేశాను. ఫన్నీ, సీరియస్ రోల్స్ కూడా చేశాను. ఓ చాట్ షోలో హోస్ట్‌గా కూడా చేశాను. నేను ఏ పాత్ర పోషించినా దానిని అద్భుతంగా చేసేందుకు చాలా కష్టపడతాను. కానీ సెక్సీగా కనబడటం నెక్స్ట్ లెవెల్...దాని కోసం ఇంకా కష్టపడాలని గ్రహించాను... ‘ఊ అంటావా మావా...థాంక్యూ,” అని తన ఇంస్టాగ్రామ్‌లో ఓ మెసేజ్ పోస్ట్ చేసింది.