ఆది పురుష్ యూనిట్‌కు ప్రభాస్ బహుమతులు

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటిస్తున్న ‘ఆది పురుష్’ సినిమాలో ప్రభాస్ పాత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభాస్ ఆది పురుష్ యూనిట్‌లో సాంకేతిక నిపుణులు అందరికీ ఖరీదైన రాడో వాచ్‌లు బహుమతులుగా ఇవ్వడంతో అందరూ ఆనందాశ్చర్యాలలో మునిగిపోయారు. ప్రభాస్ ఇది వరకు తన జిమ్ ట్రెయినర్‌కు రూ.73 లక్షలు ఖరీదు చేసే రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. 



రామాయణంలో శ్రీరాముడి కోణం నుంచి చూపిన కధగా ఆది పురుష్‌ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. దీనిలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతమ్మగా కృతి సనన్, లక్ష్మణుడుగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే, రావణాసురుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. 

తెలుగు, హిందీ బాషలలో ఒకేసారి నిర్మితమైన ఈ సినిమా 2022, ఆగస్ట్ 11వ తేదీన విడుదలకాబోతోంది. ఈ సినిమాను తమిళ్, మలయాళం, కన్నడ బాషలలో డబ్బింగ్ చేసి అదే రోజున విడుదల చేయబోతున్నారు.         ఆది పురుష్‌ నిర్మాతలు: భూషణ్ కుమార్, కృశాన్ కుమార్, ఓం రావత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్. 

బ్యానర్: టీ-సిరీస్, రెట్రోఫీలీస్  

సంగీతం: సాచెట్-పరంపర; కెమెరా: కార్తీక్ పళని; ఎడిటింగ్: అపూర్వ మోతీవాలే, ఆశిష్ మాత్రే.