పుష్ప.. తాజా అప్‌డేట్స్

స్టయిలిష్ స్టార్‌  అల్లు అర్జున్‌ అందాల భామ రష్మిక మందన జంటగా నటిస్తున్న పుష్ప సినిమాకు సెన్సార్ పని పూర్తయింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ జారీ చేసింది. పుష్పలో సమంత చేసిన ప్రత్యేక గీతం తాలూకు లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేసిన ఈ మూవీ మేకర్స్‌ రేపు (ఆదివారం) హైదరాబాద్‌ యూసఫ్ గూడా వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీనికి అల్లు అర్జున్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 17న పుష్ప ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. గతంలో అల్లు అర్జున్‌ నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేసారు. అయితే పుష్ప తెలుగు ఒరిజినల్ వెర్షన్‌తో పాటు హిందీతో సహా మూడు దక్షిణాది భాషలలో ఒకేసారి తొలిరోజునే విడుదల చేస్తున్నారు.   

నటీనటులు: అల్లు అర్జున్‌, రష్మిక మందన, సమంత, రావు రమేశ్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సునీల్, అనసూయ, ధనంజయ్, ఫహాద్ ఫాసిల్, హరీష్ ఉత్తమన్, శత్రు, శ్రీతేజ, మాళవిక వేల్స్, అజయ్ ఘోష్.     

కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాసన్, రుబెన్       

నిర్మాతలు: నవీన్ యర్నేని, వై.రవిశంకర్.  

బడ్జెట్‌: సుమారు రూ.250 కోట్లు

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్; ముత్తంశెట్టి మీడియా

డిస్ట్రిబ్యూటర్స్: లైకా ప్రొడక్షన్స్ (ఏపీ, తెలంగాణ), లక్ష్మీ మూవీస్ (తమిళనాడు); ఈ4 ఎంటర్‌టెయిన్మెంట్‌ (కేరళ); స్వాగత్ ఎంటర్‌ప్రైసస్‌ (కర్ణాటక); గోల్డ్ మైన్స్ టెలీ ఫిలిమ్స్ (ఉత్తర భారత్‌)

విడుదల: డిసెంబర్‌ 17.