సంబంధిత వార్తలు
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్పలో నటి సమంత ప్రత్యేక గీతం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఊ అంటావా... ఊఊ అంటావా మావా...’ అంటూ సాగే ఆ పాటకు సంబందించి లిరికల్ వీడియోను పుష్పా మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. మంచి ఫాస్ట్-ట్రాక్ కోర్టు బీట్తో సాగే ఆ పాటలో సమంతను రెండు మూడు స్టిల్స్‌లో అద్భుతంగా చూపించారు. చంద్రబోస్ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.’ పుష్ప ప్రీరిలీజ్ పార్టీ’ పేరుతో ఈ ఆదివారం హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో సినిమా ప్రోమోషన్ కార్యక్రమం జరుగనుంది. ఈ నెల 17న పుష్ప ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.