
మెగా డాటర్ నిహారిక తన సెకండ్ సినిమా గురించిన వార్తలను మీడియాకు లీక్ చేయట్లేదు. ఒక మనసుతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా అది ఫ్లాప్ అవడంతో ఢీలా పడ్డ నిహారిక సెకండ్ సినిమా హిట్ కొట్టేదిగా ఉండాలనే ఉద్దేశంతో కాస్త టైం తీసుకుంటుంది. ఇక రీసెంట్ గా మరాఠి హ్యాపీ జర్నీ సినిమా రీమేక్ లో నిహారిక నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కాని ఆ సినిమాపై తర్వాత ఎలాంటి న్యూస్ రాకపోయే సరికి అందరు వదిలేశారు. అయితే ప్రస్తుతం నిహారిక తన రెండో సినిమా ఏర్పాట్లో ఉన్నదట.
మొదటి సినిమా ఫ్లాప్ ఇచ్చిన బాధ నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న అమ్మడు రెండో సినిమా రీమేక్ గా కాకుండా ఒరిజినల్ స్క్రిప్ట్ తోనే చేయాలని అనుకుంటుందట. ప్రస్తుతం మరోసారి దర్శకులతో కథా చర్చల్లో పాల్గొంటుందట నిహారిక. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోయిన్ గా సూపర్ క్రేజ్ సంపాదించిన నిహారిక ఒక మనసులో నటన పరంగా ఆకట్టుకున్నా సినిమా ఆడియెన్స్ కు కనెక్ట్ అవలేదు. అందుకే ఈసారి అభిమానులు నచ్చే సినిమాతో రావాలనుకుంటుంది.
ఇప్పటికే రెండు మూడు కథలు వినడం నచ్చి హోల్డ్ లో పెట్టడం జరిగిందట. మరి నిహారిక చేసే రెండో సినిమా ఏదై ఉంటుందా అన్నది ఇప్పటికి కన్ ఫ్యూజన్ అనే చెప్పాలి. సినిమా ఓకే అయ్యి ఎనౌన్స్ చేస్తే కాని అసలు విషయం తెలుస్తుంది. అప్పటిదాకా ఇలాంటి రూమర్లు ఎన్నో వస్తూనే ఉంటాయి.