పుష్ప ట్రైలర్ విడుదల

అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న పుష్ప ఈ నెల 17వ తేదీన విడుదలకాబోతోంది. కనుక నిన్న సోమవారం సాయంత్రం 6.03 గంటలకు దాని ట్రైలర్ విడుదల చేస్తామని పుష్ప మూవీ మేకర్స్ ప్రకటించారు. అప్పటి నుంచి ట్రైలర్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొన్ని సాంకేతిక కారణాల వలన అనుకొన్న సమయానికి ట్రైలర్ విడుదల చేయలేకపోతున్నామని, అందుకు చింతిస్తున్నామని చెపుతూ అభిమానులను క్షమాపణలు తెలిపారు. అయితే ట్రైలర్ ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కానీ నిన్ననే ట్రైలర్ విడుదల చేశారు.