
తెలుగు దర్శకుల్లో పూరి స్టైలే వేరు.. ఈ విషయం స్టార్ హీరోలే ఒప్పుకున్నారు. ఇక నిన్న సాయంత్రం జరిగిన ఇజం ఆడియో వేడుకలో కూడా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరోసారి జగన్ మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తన కెరియర్ లో టెంపర్ చాలా ప్రాముఖ్యత గల సినిమా అని.. టెంపర్ తో నాలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందని.. టెంపర్ కు ముందు టెంపర్ తర్వాత తాను వేరని అన్నాడు జూనియర్. అందుకే పూరి జగన్నాథ్ అంటే తనకు చాలా స్పెషల్ అనేశాడు తారక్.
ఇక అన్న కళ్యాణ్ రాంతో ఇజం చేసిన జగన్ సినిమా హిట్ కొట్టేస్తాడని అన్నారు. సినిమా కోసం అన్న బాగా కష్టపడ్డాడని ట్రైలర్ లో ఏం పర్లేదు అన్న ఒక్క డైలాగ్ చాలు అన్నని కొత్తగా చూపించాడని చెప్పడానికి కచ్చితంగా సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని.. కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని రావాలని దేవున్ని ప్రర్ధిస్తున్నా అంటూ జూనియర్ అన్నారు. కళ్యాణ్ రాం కు స్టార్ ఇమేజ్ తెచ్చే ప్రయత్నంలో చేసిన ఈ ఇజం ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.