
పవన్ కళ్యాణ్, రాణా ప్రధాన పాత్రలలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న భీమ్లా నాయక్ చిత్రంలో నాలుగో సాంగ్‌ను శనివారం ఉదయం విడుదలైంది. ఈరోజు విడుదల చేసిన ‘అడవి తల్లి మాట..’ సాంగ్‌ను రామజోగయ్య శాస్త్రి రచించగా దుర్గావ్వ, చాగంటి సాహితి దానీ సుమధురంగా ఆలపించారు. ఈ పాటను డిసెంబర్ 1వ తేదీని విడుదల చేయాలనుకొన్నారు కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణించడంతో అప్పుడు వాయిదా వేసి ఈరోజు విడుదల చేశారు. భీమ్లా నాయక్‌లో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాను సూర్యదేవర నాగవంశి సిధార్ధ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: ఎస్ఎస్ ధమన్; కెమెరా: రవి కె చంద్ర; ఎడిటింగ్: నవీన్ నూలి.
మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పమ్ కొషియమ్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న భీమ్లా నాయక్ జనవరి 12న సంక్రాంతి కానుక ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది.