కొరియోగ్రాఫర్ శివశంకర్‌ చికిత్సకు సోనూసూద్ సాయం

ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్, ఆయన కుటుంబం కరోనా బారిన పడింది. ఆయన, పెద్ద కుమారుడు విజయ్, భార్య కరోనా బారిన పడ్డారు. శివశంకర్ మాస్టర్, విజయ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన భార్య హోమ్ క్వారెంటైన్‌లో ఉంటున్నారు. శివశంకర్, విజయ్ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. 

శివశంకర్ మాస్టర్‌ను ప్రస్తుతం హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనాతో ఆయన రెండు ఊపిరితిత్తులు బాగా ఇన్ఫెక్షన్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు.

శివశంకర్ మాస్టర్ రెండో కుమారుడు అజయ్ కృష్ణ నిన్న మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం తమ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, శివశంకర్ మాస్టర్ చికిత్సకు రోజుకు రూ.2.5 లక్షలు ఖర్చు అవుతోందని కనుక తమ కుటుంబానికి ఆర్ధిక సాయం చేయాలని సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. 

ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ వెంటనే సందిస్తూ, శివశంకర్ మాస్టర్‌ను కాపాడుకొనేందుకు అన్ని వీడాల ప్రయత్నిస్తానని, ఆయన కుటుంబానికి అండగా ఉంటానని ట్వీట్ చేశారు. ఇప్పటికే దీని గురించి అజయ్ కృష్ణతో మాట్లాడానని తెలిపారు.                    

శివశంకర్ మాస్టర్ తెలుగుతో సహా దక్షిణాదిలో అన్ని భాషలలో సినిమాలు నృత్యదర్శకత్వం చేసారు. కొన్ని తెలుగు, తమిళ్ సినిమాలలో నటించారు కూడా.