
కోలీవుడ్లో సూపర్ ఫాంలో ఉన్న నయనతార ఇప్పుడు ఓ సినిమా కోసం ఏకంగా 4 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట దాదాపు ఓ రేంజ్ హీరో తీసుకునే పారితోషికం కేవలం ఓ హీరోయిన్ కు ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. సౌత్ అన్ని భాషల్లో క్రేజ్ సంపాదించిన నయనతార కోలీవుడ్లో మాత్రం ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించింది. అక్కడ ఓ బడా నిర్మాత ఆమెను ఓ సినిమా కోసం అడుగగా 4 కోట్లు ఇస్తేనే లేదంటే లేదు అనేసిందట.
ఇక నయన్ క్రేజ్ గురించి తెలిసిన నిర్మాత కాబట్టి చేసేదేం లేక ఆమె అడిగిన దానికి ఓకే అన్నాడని టాక్. ఇన్నాళ్లు బాలీవుడ్ భామలు మాత్రమే కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారనే టాక్ ఉంది మొట్టమొదటిసారిగా సౌత్ లో నయనతార భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ మిగతా భామలకు షాక్ ఇస్తుంది. అఫ్కోర్స్ నయన్ సినిమా చేస్తే అంతకు రెట్టింపు వసూళ్లు వస్తున్నాయనుకోండి. ఏది ఏమైనా ఓ హీరోయిన్ గా నయన్ 4 కోట్ల రెమ్యునరేషన్ అంటే గొప్ప విషయమే అని చెప్పాలి.
మరి 4 కోట్ల నయన్ సినిమాలో ఎలా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. రీసెంట్ గా ఇంకొక్కడు సినిమాతో కోలీవుడ్ లో కూడా హిట్ అందుకున్న నయనతార సినిమాలో ఉంది అంటే సినిమా హిట్ అన్న సెంటిమెంట్ బలంగా పాకింది. అందుకే ఆమె పారితోషికంలో దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది.