సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులకు మరింత ఉత్సాహం కలిగించే వార్త ఇది. పుష్ప సినిమాలో ఓ ప్రత్యేక గీతం (ఐటెమ్ సాంగ్) చేసేందుకు ప్రముఖ హీరోయిన్ సమంత అంగీకరించింది. ఈ పాటతో ఆమె తొలిసారిగా అల్లు అర్జున్‌తో కలిసి డ్యాన్స్ చేయనుంది. దీని కోసం నిర్మాతలు ఆమెకు రూ.2 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక గీతం కోసం ఇప్పటి వరకు అత్యధికంగా కోటి రూపాయలు మాత్రమే చెల్లించగా తొలిసారిగా సమంత రెండు కోట్లు అందుకోబోతోంది. కనుక సమంత దీని షూటింగ్ కోసం 3-4 రోజులు సమయం కేటాయించినట్లు సమాచారం.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్,రష్మిక మందన జంటగా నటిస్తున్నారు. దీనికి దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రూపొందిస్తున్నారు. డిసెంబర్ 17వ తేదీన పుష్ప సినిమా విడుదలకాబోతోంది.