
అఆ హిట్ తో మంచి ఊపుమీదున్న నితిన్ తన తర్వాత సినిమా హను రాఘవపుడితో చేస్తున్నాడు. అయితే అఆతో ఊహించని రేంజ్లో అందరి అంచనాలను తలకిందలు చేసి 50 కోట్ల కలక్షన్స్ సాధించిన నితిన్ ఇప్పుడు ఆ క్రేజ్ ను కాపాడుకునే ప్రయత్నంలో పడ్డాడు. హనుతో సినిమా కూడా ఓవర్సీస్ ప్రేక్షకులకు నచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే సినిమా 90 శాతం వరకు ఫారిన్లోనే ఉంటుందట. యూఎస్ గాని యూకె గాని లొకేషన్స్ సెట్ చేసే పనిలో ఉన్నారట.
హను మార్క్ సెన్సిబుల్ లవ్ స్టోరీతో పాటుగా సినిమా మంచి ఎంటర్టైనింగ్ గా రాసుకున్నాడట. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హను నితిన్ కు మరో హిట్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడు. 14 రీల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ అవ్వాల్సి ఉంది. సినిమా మొత్తం ఫారిన్ లోనే అంటే హను ఈసారి ఓ కమర్షియల్ లవ్ స్టోరీ చెప్పబోతున్నాడు అనుకోవచ్చు.
కుర్ర హీరోలంతా తమ మార్క్ ఎంటర్టైనింగ్ సినిమాలతో ఓ రేంజ్ హిట్ కొడుతున్న ఈ టైంలో అటు స్టార్స్ గా ఎదగలేక కుర్ర హీరోలతో కలిసి ఉండలేక మధ్యలో నితిన్ లాంటి హీరోలు గట్టి పోటీ ఎదుర్కుంటున్నారు.