తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా కాశీ విశ్వనాథ్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో ఎంత రచ్చరచ్చ అయిందో అందరూ చూశారు. కానీ మొన్న ఆదివారం జరిగిన దర్శకుల సంఘం ఎన్నికలు అందుకు పూర్తి భిన్నంగా చాలా ప్రశాంతంగా ముగిశాయి. తెలుగు సినీ దర్శకుల సంఘానికి కొత్త అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత యనమదల కాశీ విశ్వనాథ్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో దర్శకులు సముద్ర, చంద్రమహేష్...వారి ప్యానెల్స్ పోటీ చేయగా వారి ప్యానెల్స్ నుంచి చెరో ఇద్దరు సభ్యులు మాత్రమే ఎన్నికయ్యారు. 

కాశీ విశ్వనాథ్ అధ్యక్షుడిగా ఏర్పడిన కొత్త ప్యానల్ వివరాలు: 

అధ్యక్షుడు: కాశీ విశ్వనాథ్

ఉపాధ్యక్షులు: మేర్లపాక గాంధీ, జీఎస్ రావు  

ప్రధాన కార్యదర్శి: వీఎన్ ఆధిత్య

సంయుక్త కార్యదర్శులు: కృష్ణ మోహన్ అనుమోలు, పెండ్యాల రామారావు

కార్యనిర్వాహక కార్యదర్శులు: కొల్లి రాంగోపాల్, దొండపాటి వంశీ

కోశాధికారి: భాస్కర్ రెడ్డి

కార్యవర్గ సభ్యులు: కాటూరి రాఘవ, కూరపాటి రామారావు, గుంటూరు అంజిబాబు, ఇ. ప్రేమ్‌ రాజ్, ఎం. సాయి సురేంద్ర బాబు, పీవీ రమేశ్‌ రెడ్డి, నీలం సాయిరాజేశ్, అల్లా భక్ష్. 

మహిళల రిజర్వేషన్ కోటాలో ఎన్నికైన సభ్యులు: సౌజన్య, ప్రవీణ.