నాని శ్యామ్ సింగ రాయ్ టీజర్ వచ్చేస్తుంది..!

నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా నుండి ఈమధ్యనే వచ్చిన టైటిల్ సాంగ్ సూపర్ హిట్ కాగా ఇక లేటెస్ట్ గా శ్యాం సింగ రాయ్ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. శ్యామ్ సింగ రాయ్ సినిమా టీజర్ నవంబర్ 18న రిలీజ్ ఫిక్స్ చేశారు.

సినిమాలో నాని డ్యుయల్ రోల్ లో నటించారు. నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా వస్తుంది. కలకత్తా బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో నాని రెండు పాత్రల్లో అదరగొడతాయని తెలుస్తుంది. ట్యాక్సీవాలా సినిమాతో సత్తా చాటిన రాహుల్ సంకృత్యన్ శ్యామ్ సింగ రాయ్ తో మరోసారి తన ప్రతిభ చాటాలని చూస్తున్నారు.