
మళయాళ మూవీ దృశ్యం సీక్వల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా సూపర్ హిట్ అయ్యింది. మోహన్ లాల్ నటించిన ఈ సినిమాను జీతు జోసెఫ్ డైరెక్ట్ చేశారు. దృశ్యం సినిమా తెలుగులో వెంకటేష్ నటించారు. ఇప్పుడు దృశ్యం 2 సినిమాను జీతు జోసెఫ్ డైరెక్ట్ చేశారు. వెంకటేష్, మీనా కలిసి నటించిన ఈ దృశ్యం 2 నుండి టీజర్ రిలీజైంది. దృశ్యం సినిమాకు కొనసాగింపుగా ఈ సీక్వల్ ఉంటుంది. ఇక ఈ సినిమాను నవంబర్ 25న అమేజాన్ ప్రైం లో రిలీజ్ ఫిక్స్ చేశారు.
ఆల్రెడీ మళయాళ వర్షన్ కూడా సూపర్ హిట్ కాగా ఇప్పుడు తెలుగు వర్షన్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండగా వెంకటేష్ మరోసారి తన నటనతో మెప్పించాడని తెలుస్తుంది. దృశ్యం 2 ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్ లో నిర్మించారు.