చిరు 154లో మాస్ రాజా..!

మెగాస్టార్ చిరంజీఇ కె.ఎస్ రవీంద్ర కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మరో హీరో నటిస్తాడని టాక్. చిరు 154 సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని టాక్. అసలైతే ముందు ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ను అనుకున్నాడట డైరక్టర్ కె.ఎస్ రవీంద్ర కాని ఫైనల్ గా రవితేజకు ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

చిరుతో రవితేజ ఆల్రెడీ అన్నయ్య సినిమాలో నటించాడు. అయితే సోలో హీరోగా మారాక మాత్రం చిరు సినిమాల్లో కనిపించలేదు రవితేజ. ఇన్నాళ్లకు ఆ అవకాశం వచ్చింది. కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లోనే పవర్ సినిమాతో హిట్ అందుకున్నాడు రవితేజ.