బాలయ్య అభిమానులకు దసరా గిఫ్ట్..!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతుంది. క్రిష్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. శాతవాహన చక్రవర్తి రాజుగా కనిపించనున్న బాలయ్య బాబు సినిమాతో రికార్డులను సృష్టించడం ఖాయమే అంటున్నారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్ ను దసరా కానుకగా అక్టోబర్ 11న ఉదయం 8 గంటలకు రిలీజ్ చేస్తున్నారట.

ఇదో రకంగా బాలయ్య అభిమానులకే కాదు సిని అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక అక్టోబర్ 9న బాలయ్య మరో లుక్ ను రివీల్ చేస్తాడట క్రిష్. తన ప్రతి సినిమాలో ఓ ప్రత్యేకతను చాటుకుంటూ ప్రతిభ కనబరుస్తున్న క్రిష్ ఈ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. బాలయ్య మార్క్ నటన చాతుర్యంతో వస్తున్న ఈ సినిమా తప్పకుండా తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని చిత్రయూనిట్ చెబుతుంది.

మరి ఫస్ట్ లుక్ పోస్టర్ లానే టీజర్ కూడా అరుపులు పెట్టిస్తే వచ్చే సంక్రాంతికి బాలయ్య అభిమానులు ఒకేసారి రెండు పండుగలు చేసుకునే అవకాశం ఉంది. చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మిస్తున్నారు. సినిమా మీద వస్తున్న అంచనాలతో బిజినెస్ కూడా భారీ రేంజ్లోనే అవుతుందట.