
ఫుల్ ఫాంలో ఉన్న కింగ్ నాగార్జున ప్రస్తుతం తను చేస్తున్న ఓం నమో వెంకటేశాయ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో కలిసి మరోసారి ప్రేక్షకులను భక్తిరస పరవశాన్ని కలిగించడానికి వస్తున్న నాగార్జున సినిమా మొదలు పెట్టినప్పుడు సంక్రాంతి టార్గెట్ అనుకున్నారు. కాని ఇప్పటికే పొంగల్ వార్లో బాలయ్య, చిరుల ఫైట్ తప్పనిసరి అని తేలింది. అందుకే ఎందుకొచ్చిన గొడవ అని నాగార్జున తన సినిమాను రిలీజ్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట.
అయితే కారణం పోటీనే అయినా ఓం నమో వెంకటేశాయకు గ్రాఫిక్ వర్క్ కొంత టైం తీసుకుంటుంది అందుకే సంక్రాంతికి కష్టమే అని నాగార్జుననే చెప్పుకొస్తున్నాడు. మరి నిజంగా గ్రాఫిక్ వర్క్ కారణంగా లేక పోటీలో ఎందుకులే అనుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. భక్తిరస సినిమా కాబట్టి పోటీ లేని టైంలో వదిలే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
శిరిడిసాయి సినిమా నిర్మాత మహేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, అనుష్క, విమలా రామన్ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.