
మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భోళా శంకర్. ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగాయి. ముహుర్త కార్యక్రమానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమాలో తమన్నా, కీర్తి సురేష్ నటిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఈ నెల 15 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.
తమిళంలో సూపర్ హిట్టైన వేదాళం రీమేక్ గా భోళా శంకర్ సినిమా వస్తుంది. అయితే ఆ కథను చిరు ఇమేజ్ కు తగినట్టుగా డైరక్టర్ మహర్ రమేష్ పూర్తిగా మార్చేశాడని తెలుస్తుంది. చాలా గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. గాడ్ ఫాదర్, కె.ఎస్ రవీంద్ర సినిమాలతో పాటుగా భోళా శంకర్ పై కూడా మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.