రానా ఫిట్నెస్ అందుకేనట..!

టాలీవుడ్ కండల వీరుడు అంటే దగ్గుబాటి వారసుడు రానా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. బాహుబలిలో భళ్లాల దేవగా రానా చూపించిన ఆ కండ బలం అదరహో అనిపించింది. అయితే బాహుబలి మొదటి పార్ట్ కోసం దాదాపు 108నుండి 110 కేజిల దాకా పెరిగిన రానా ఇప్పుడు ఆ వెయిట్ 90 నుండి 95కు తగ్గించాడట. దీని కోసం రానా చాలానే కష్టపడ్డాడట. ప్రస్తుతం రానా చేసిన జిం ఎక్సర్ సైజ్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా పాకుతున్నాయి. 

మొదటి పార్ట్ లో ఓల్డ్ గెటప్ కాబట్టి పర్వాలేదు కాని సెకండ్ పార్ట్ లో యంగ్ గా కనిపించాలి అందుకే మళ్లీ వెయిట్ లాస్ అవుతున్నా.. ఆ క్రమంలో ట్రైనర్ చెప్పినట్టుగా న్యూట్రిషన్ ఫుడ్ రెండుగంటలకు ఒకసారి క్రమం తప్పకుండా తీసుకున్నా దీని కోసం స్పెషల్ గా ఓ మనిషిని ఆపాయింట్ చేసుకున్నా అని అంటున్నాడు రానా. మరి సినిమాలో కనిపించే లుక్ కోసం ఈ రేంజ్లో కష్టపడుతున్న రానాకి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 

ఇక బాహుబలిలో భళ్లాల దేవగా ఓ రేంజ్ క్రేజ్ సంపాదించిన రానా తన సోలో సినిమాల మీద కూడా ఇప్పుడు కాన్సెంట్రేట్ చేశాడు. ప్రస్తుతం ఘజి సినిమా చేస్తున్న రానా త్వరలోనే రెండు తెలుగు సినిమాలకు సైన్ చేయబోతున్నాడు.