
మంచిరేవులలో యువ హీరో నాగ శౌర్య ఫ్యామిలీ ఫాం హౌజ్ లో ఇటీవల పేకాట ఆడుతున్నారన్న సమాచారం తెలియగా అక్కడకు వెళ్లిన పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతున్న ఈ క్రమంలో ప్రధాన నిందితుడిగా గుత్తా సుమన్ పేరు వినపడుతుంది. ఆయనతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ పేకాట దందాలో నాగ శౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ పాత్ర కూడా ఉందని పోలీసులు గుర్తించారు. అందుకే పోలీసులు నాగ శౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ను అరెస్ట్ చేశారు.
ఇంతకుముందు ఒకటి రెండు సార్లు నోటీసులు ఇచ్చినా శివలింగ ప్రసాద్ వాటిని లైట్ తీసుకున్నారని సమాచారం. లేటెస్ట్ గా వారి ఫాం హౌజ్ లో పేకాట ఆడుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో కేసు ఫైల్ చేశారు. అయితే ఫాం హౌజ్ ఓనర్ గానే కాదు ఈ పేకాట దందాతో తనకు సంబందం ఉందని విచారణలో తెలుసుకున్న పోలీసులు శివలింగ ప్రసాద్ ను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు.