అల్లు అర్జున్ కు లీగల్ నోటీస్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు టీ.ఎసార్టీసీ నుండి లీగల్ నోటీసులు వచ్చాయి. ఆన్ లైన్ బైక్ రైడ్ సంస్థ ర్యాపిడో యాడ్ లో అల్లు అర్జున్ ఆర్టీసీ బస్ ప్రయాణాన్ని అవమానించేలా మాట్లాడారని.. అందుకు తగిన సమాధానం కావాలని నోటీసులు పంపించారు టీ.ఎస్.ఆర్టీసీ ఎండి సజ్జనార్. ఆర్టీసీ బస్సులో ప్రయాణం మాములు దోశ కాస్త జనాల ఒత్తిడి.. ఇబ్బంది వల్ల మసాలా దోశ ఔతుందని ఓ డైలాగ్ ఉంది. ఆటీసీ బస్సులను అవమానించేలా ఉన్న ఈ యాడ్ పై ఆర్టీసీ ఎండి సీరియస్ అవుతున్నారు.

అల్లు అర్జున్ తో పాటుగా ర్యాపిడ్ యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపించినట్టు తెలుస్తుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వాణిజ్య ప్రకటనలు చేస్తున్నాడు అల్లు అర్జున్. అయితే సౌత్ లో వాణిజ్య ప్రకటనలతో అందరి కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు మహేష్.