
యువ హీరోల్లో ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్న హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం తేజ మర్ని డైరక్షన్ లో చేస్తున్న సినిమా అర్జున ఫల్గుణ. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇన్నాళ్లు క్లాస్ సినిమాలతో ఎమోషనల్ ఎంటర్టైనర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు ఈసారి మాస్ అండ్ యాక్షన్ సినిమాతో వస్తున్నాడు. అర్జున ఫల్గుణ టీజర్ చూస్తేనే సినిమా రేంజ్ ఏంటన్నది అర్ధమవుతుంది.
నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను.. అయినా బలైపోవడానికి అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటూ శ్రీ విష్ణు చెప్పిన డైలాగ్ టీజర్ కు మరింత క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఓ మంచి కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని అనిపిస్తుంది. శ్రీవిష్ణు సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ నరేష్ శివాజి రాజా, సుబ్బరాజు నటిస్తున్నారు. టీజర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించగా సినిమా కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.