RRR నుండి నాటు నాటు సాంగ్ ప్రోమో..!

రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న RRR సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీఎజైంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. కొమరం భీం పాత్రలో తారక్ నటిస్తున్నాడు. సినిమా నుండి ఇప్పటికే వారి పాత్రలను పరిచయం చేస్తూ టీజర్లు రాగా ఈమధ్యనే RRR నుండి మొదటి సాంగ్ దోస్తీ అంటూ రిలీజ్ అయ్యింది.

కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు. ట్రిపుల్ R సినిమా నుండి నాటు నాటు సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫుల్ సాంగ్ నవంబర్ 10న రిలీజ్ ప్లాన్ చేశారు. నాటు నాటు సాంగ్ మాస్ ఆడియెన్స్ కు బాగా ఎక్కేలా ఉంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా 2022 జనవరి 7న రిలీజ్ ఫిక్స్ చేశారు. సంక్రాంతికి ముందే వరల్డ్ వైడ్ గా RRR మూవీ సందడి మొదలవుతుంది.