మెగాస్టార్ తో త్రివిక్రమ్..!

మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా పూజా కార్యక్రమాలు ఈమధ్యనే జరిగాయి. కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో చిరు సినిమా వస్తుంది. ఈ సినిమాతో పాటుగా మెహర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్, మోహన్ రాజా డైరక్షన్ లో గాడ్ ఫాదర్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాటల మాంత్రికుడు త్రివిక్రం తో సినిమా చేస్తారని తెలుస్తుంది. త్రివిక్రం తో చిరు సినిమా కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్నా ఫైనల్ అవలేదు.

అయితే ఈమధ్య జరిగిన చర్చల్లో త్రివిక్రం తో చిరు సినిమా దాదాపు కన్ ఫర్మ్ అని అంటున్నారు. ఈ సినిమాను ఆర్.ఆర్.ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తాడని టాక్. త్రివిక్రం సినిమా అంటే హారిక హాసిని బ్యానర్ ఉండాల్సిందే. అయితే చిరంజీవి డేట్స్ డివివి దానయ్య దగ్గర ఉండటంతో త్రివిక్రం సినిమాకు ఆయన ప్రొడ్యూసర్ గా మారుతున్నాడని తెలుస్తుంది.