బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 2 ప్రోమో..!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో వస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్. మొదటి ఎపిసోడ్ మంచు ఫ్యామిలీతో జరిగిన బాలయ్య బాబు అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ సెల్ఫ్ మేడ్ యాక్టర్ నాచురల్ స్టార్ నానితో చేస్తున్నారు. దీనికి సంబందించిన ప్రోమో రిలీజైంది. బాలకృష్ణ ఎవర్ గ్రీన్ ఎంట్రీ.. ఆడియెన్స్ నుండి నాని ఎంట్రీ.. రెండు అదిరిపోయాయి. ఇక నానికి సంబందించిన ఆసక్తికరమైన విషయాలను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ కొద్దిసేపు క్రికెట్ ఆట కూడా ఆడించారు.

ఫైనల్ గా నాని అన్ స్టాపబుల్ కి అద్ర్ధం చెబుతూ ఆడియెన్స్ చేత క్లాప్స్ కొట్టించాడు. మొత్తానికి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సెకండ్ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిందని తెలుస్తుంది. బాలయ్య బాబు హోస్టింగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.